పరిపూర్ణుడు ప్రేమలో ; - --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

సృష్టిలో భగవంతుడు 
పరికింపగ బలవంతుడు 
శ్రద్ధగా ధ్యానిస్తే 
భక్తులకు విమోచకుడు 

నడిపించే నాయకుడు 
తన భక్తుల ప్రేమికుడు 
పూజిస్తే వశమగును 
దీవెనలు కుమ్మరించును 

అసమానుడు భగవంతుడు 
అసాధ్యం లేనే లేదు 
మిగుల ఆశ్చర్యకరుడు 
మానవ మేధకు అతీతుడు 

ఆరాధనకు అర్హుడు 
సతతము పూజనీయుడు
దేవుడే సర్వజ్ఞుడు 
ప్రేమలో పరిపూర్ణుడు

కామెంట్‌లు