తొట్టంబేడు మండలం లో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ ఉపాధ్యాయులు,కవి, రచయిత, మిమిక్రీ కళాకారుడు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని ఫిన్లాండ్ లో అంతర్జాతీయ విద్యా అధ్యయన శిక్షణా కార్యక్రమం
విజయవంతం గా ముగించుకుని వచ్చిన సందర్భంగా శ్రీకాళహస్తికి చెందిన నాగమల్లి కృష్ణ మూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు
రాజశేఖర్ మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ ఆర్.పి.బి.యస్ ఉన్నత పాఠశాల భువన విజయం లో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తి తో పాటు సాహిత్యం మరియు మిమిక్రీ కళను ఫిన్లాండ్ దేశంలో కూడా ప్రదర్శించడం శ్రీకాహస్తి నియోజక వర్గానికే గర్వకారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో
చంద్రశేఖర్,నవీన్, జ్యోతిరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి