ఆరుద్రకు అక్షరాంజలులు: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా.
 

బీదలపాట్లు తో  సినీ జీవితాన్ని ప్రారంభించి
పేదరికం ప్రగతికి అడ్డంకాదని
చెన్నపట్నం లో కుళాయి నీళ్ళతో కడుపు నింపుకు 
కొండగాలి తిరిగింది 
గుండె ఉసులాడింది 
గోదావరి వరదలాగ 
కోరిక చెలరేగింది అని 
అందాల రాముడు ఇందీవర శ్యాముడు అని 
ఉయ్యాల జంపాలా సినిమా పాటలతో దశ తిరిగి 
శ్రీరామనామాలు శతకోటి అని మీనా చిత్రంలో
ఊహలు గుస గుసలాడే నా హృదయం ఊగిసలాడే అని బందిపోటులో
అందాల రాముడులో ఎదగడానికెందుకురా తొందరా యని
గోరంతదీపం లో  రాయినైన కాకపోతిని రామపాదం సోకగా యని 
ఏదో ఏదో అన్నది మసక వెలుతురు అని ముత్యాల ముగ్గులో
మానవుడే మహనీయుడు అని బాలభారతంలో
వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా 
శోభిల్లే రాజమహేంద్రి అని ఆంధ్రకేసరి సినిమాలలో 
అద్భుతమైన అక్షరమాలికలతో 
సినీ గేయాలనందించి
"త్వమేవాహం" రచనలో నైజాం నిరంకుశ పాలనను వర్ణించి 
కూనలమ్మ పదాలు 
సమగ్ర ఆంధ్రసాహిత్యం రచన 
రాదారి బంగళా, సీతాకోక చిలుక వంటి నాటిక రచనలతో 
సాహితీ రంగంలో సినీ రంగంలో అందనంత ఎత్తుకు ఎదిగిన 
మీరు ఆంధ్రవిశ్వావిద్యాలయం కళాప్రపూర్ణ సాహిత్య అకాడమీ 
పురస్కారాలకే వన్నె తెచ్చిన మహనీయులు
మీ సాహితీసేవకు గుర్తింపుగా శత జయంతి  సందర్భంగా 
ప్రభుత్వం పోస్టల్ స్టాంపు ను విడుదల చేయడం 
తెలుగు వారికి గర్వకారణం.
అందుకోండి మీ కివే నా అక్షరాంజలులు...!!
...............................
కామెంట్‌లు