హలో పిల్లలూ! ఈరోజు ఆవాల అమ్మాయిని తయారు చేద్దాం. ఆవాలు నల్లగా ఉంటాయి కాబట్టి ఇన్ని రోజులూ అమ్మాయిని చేయ్యలేదు. ఇందులో ఆవాలను తలకు జుట్టుగా ఉపయోగించాను. బాబ్డ్ హెయిర్ తో పాప ముద్దుగా ఉన్నది. ఈ పాపను ముద్దుగా తయారు చేశాను. ఆమె వేసుకున్న గౌనును గుమ్మడి గింజలతో కుట్టాను. ఆ గింజల్లో కొవ్వులు, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఆవాలు పసుపు పచ్చ పూలతో చేనును ప్రభావితం చేస్తుంది. చేనంతా పసుపు జల్లినట్లుగా ఆకాశంమంతా కూడా మెరుపు మెరుస్తుంది. దీని శాస్త్రీయ నామం “బ్రాసికా నైగ్రా”. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందిన చిన్న మొక్క. ఈ ఆవాలు వంటలలో మసాలా దినుసులుగా ఉపయోగిస్తారు. వీటి పెంపకం సుమారు 6000 సం..ల క్రితమే ప్రారంభం అయింది. క్రీస్తు పూర్వమే సింధు నాగరికత ద్వారా ఆవాలు పండించబడ్డాయని ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా పేర్కొన్నది. ఇంట్లో చెరిగిన ఆవాలు కుండీలలో పడి మొక్కలు మొలిచాయి. ఆవాలు కాయలుగా కాస్తాయి. ఒక్కొక్క కాయలో ఆవాలు గింజలు పది దాకా ఉండవచ్చు.
ఒక పేపర్ మీద అమ్మాయి బొమ్మను గీసుకొని దానిమీద జుట్టు కోసం ఆవాలను అతికించాను. నెత్తిమీద కందిపప్పు పూలు పెట్టాను. చక్కని గౌనును గుమ్మడి గింజలతో కుట్టాను. చింత గింజలతో బూట్లు తయారుచేసి తొడిగాను. ఆవాల అమ్మాయిని ఆకాంక్ష అని పెట్టాను బాగుందా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి