సిల్వర్ జూబ్లీ కళాశాల....!!-డా ప్రతాప్ కౌటిళ్యా.


మా కలల శాల 
సిల్వర్ జూబ్లీ కళాశాల 
కళల పాఠశాల 
సిల్వర్ జూబ్లీ కళాశాల 
అలల సముద్రం 
మా సిల్వర్ జూబ్లీ కళాశాల. 

తూర్పున పొద్దాయి పొడిచింది 
మా మార్పుకు విద్యని నేర్పింది 
పడమరన పొద్దు మూకింది 
రేపటి మా మార్పు కై మళ్లీ సిద్ధమైంది.
అది మా సిల్వర్ జూబ్లీ కళాశాల. 

అది ఒక ఆకాశం 
మేము నక్షత్రాలం.
అది ఒక శూన్యం 
మేం గెలాక్సీలం
అంతులేని లక్ష్యాలం.!!

అది ఒక సముద్రం 
మేము మిగిలిన ఒక భూభాగం. 
అది ఒక మహా రణ్యం 
మేము మహావృక్షాలం
భవిష్యత్తు సాక్ష్యాలం...!!

అది ఒక మైదానం 
మేము ఆకుపచ్చని ధనం 
అది ఒక గనీ
మేము వెండి బంగారం..!!

అది ఒక వెండి వెన్నెల 
మేము పండు వెన్నలం
అది ఒక మురళి 
మేము సప్త స్వరాలం
అది ఒక నీటి బిందువు 
మేము ఏడు రంగుల ఇంద్రధనస్సులం.!!

అది వీచే గాలి 
మేము గంధపు పరిమళం 
అది కంటిచూపు 
మేము కంటికి రెప్పలం..
అది ఒక కాంతి కిరణం 
మేము మేము పరిగెత్తే అక్షరాలం.!!

అది ఒక నది 
మేము జలపాతాలం
అది ఒక తోట 
మేం మాట ఆట పాటలం..
అది ఒక శబ్దం 
మేం శాంతి దూతలం 
అది ఒక కర్మ 
మేము ఒక ధర్మం..!!

మా కలల శాల 
సిల్వర్ జూబ్లీ కళాశాల 

అది తూర్పున పొద్దయి పొడిచింది 
మా మార్పుకు విద్యను నేర్పింది 
పడమరన పొద్దయి మూకిందీ
రేపటి మా మార్పుకు మళ్ళీ సిద్ధమైంది 

మా కలల శాల 
సిల్వర్ జూబ్లీ కళాశాల.!!!
=========================================================
అక్టోబర్ 4 సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రెటర్నటీ అన్వల్ మీటింగ్ పురస్కరించుకొని. 
==========================================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు