కళ్ళల్లో వేలల్లో ఉంటారు.!!!
మనసులో ఒకరే ఉంటారు
మాటల్లో కోట్లల్లో ఉంటారు.!!!!
పాటల్లో కోకిల ఒకటే ఉంటుంది
నాలుకలో నలుగురు ఉంటారు.!!
నాట్యంలో నెమలి ఒకటే ఉంటుంది.
నటనల్లో నటులు ఎందరో ఉంటారు.!!!
నేతల్లో సాలిడు ఒకటే ఉంటుంది.
చేతల్లో చెల్లని నైపుణ్యాలెన్నో ఉంటాయి.!
పరుగులో చిరుత ఒకటే ఉంటుంది.
పరుగులేని నరులు ఎందరో ఉంటారు.!!
ఈతలో నేతలు ఎందరో ఉంటారు
ఎదురీతలో చేప ఒకటే ఉంటుంది.!!!
గాలిలో మేఘాలెన్నో ఉంటాయి.
మేఘానికి ఆవల పక్షి ఒకటే ఉంటుంది.!!
-------------------------------------------
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి