నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్నను డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం వరించింది.యం. వి. ఫౌండేషన్ అధినేత శ్రీ లీలా మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ కె. వేంకట సత్యనారాయణ మూర్తి,విశ్రాంత డైట్ ప్రిన్సిపాల్ డా.మావిళ్ల లోకనాథం, సినీ గేయ రచయిత శ్రీ సాదనాల వేంకట స్వామినాయుడు, వర్ధమాన కవి శ్రీ చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని డి. ఆర్.యస్ కళ్యాణ మండపం, నెల్లూరులో కవులు, కళాకారుల సమక్షంలో అందుకున్నారు. అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను సత్కరించి, వారి తెలుగు సాహితీ కృషిని గొనియాడారు.ఈ కార్యక్రమంలో యలమందల తిరుపతి, డా. అయినాల మల్లేశ్వరరావు,విశ్వ సాహితీ వేదిక రాష్ట్ర కార్యదర్శి వన్నం బ్రహ్మయ్య, నెల్లూరు జిల్లా పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు అవ్వారు శ్రీధర్ బాబు,కె. వి. నాగేశ్వరయ్య మరియు పాత్రికేయ మిత్రులుపాల్గొన్నారు.
బహు గ్రంథకర్త,పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి