సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు తెలుగు తిరుమలేష్ గారికి,ఇతర తెలుగు ఉపాధ్యాలయులకు ఘన సన్మానం అభినందనీయం.. ..కరస్పాండెంట్ టి.జె.సాయి చరణ్
మాతృభాషను ప్రేమించు..పరభాషలను గౌరవించు... ప్రిన్సిపాల్
మాతృభాషను ప్రేమించు..పరభాషలను గౌరవించు... ప్రిన్సిపాల్
ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాణి హై స్కూల్ లో బుధవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రిన్సిపాల్ లతా మరియు గంగాధర్ మరియు అంజనీ మరియు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి తెలంగాణ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు తెలుగు తిరుమలేష్ గారిని మరియు ఇతర తెలుగు ఉపాధ్యాయులు స్వర్ణ, స్వాతి, సునీత,నాగేంద్రమ్మ, మహేశ్వరి తదితర ఉపాధ్యాయుల సేవను అభినందిస్తూ ఆత్మీయంగా సన్మానించి వారికి తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోనీ విద్యార్థులకు కవి సమ్మేళనం మరియు ఏకపాత్రాభినయంతో పాటు, పద్య పఠనం కంఠస్థం చేయించారు.విద్యార్థులు వివిధ శతక పుస్తకాలలోని పద్యాలను కంఠస్థం చేసి వినిపించారు.సుమతి శతకంలోని పద్యాలను విద్యార్థులు అందరు కూడా కంఠస్థం చేసి చెప్పారు. అలాగే వేమన శతకంలోని పద్యాలను కూడా కంఠస్థం చేసి చెప్పారు. అలాగే తెలుగు భాష గొప్పతనాన్ని గురించి కవితాత్మకంగా మరియు ఉపన్యాస రూపంలో విద్యార్థులు తెలియజేశారు. తెలుగు భాషకు హృదయం లాంటిది వివిధ సాహిత్య క్రీడలను విద్యార్థులకు నిర్వహించారు.ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులను అందరూ ప్రశంసించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అమ్మ ప్రేమ కన్నా తీయనైనది లేదు.మాతృభాష కన్న మధురమైనది లేదు. త్రిలింగ భాష తెలుగు భాష.కావున మాతృభాషను ప్రేమించు..పరభాషలను గౌరవించండి అని తెలియజేస్తూ అందరికీ తెలంగాణ తెలుగు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి