ప్రకృతి శాపమా? మనిషి తప్పిదమా?...మంజుల పత్తిపాటి.


నదులు, చెరువులు, కుంటలు , సముద్ర ముఖద్వారాలను
 ఆక్రమించి  నీటిని మన వీధుల్లోకి
ఆహ్వానిస్తున్నాం..!

బోర్లు వేసి భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తూ…
భూమాతను కిందికి నెట్టేస్తూ…
సముద్ర నీటిని మన గడపకు ఆహ్వానిస్తున్నాం..!

 మన స్వార్థం వల్ల పర్యావరణానికి హాని చేస్తూ…
అడవులను నరికివేస్తూ…
ఎల్ నినో ని ఆహ్వానిస్తున్నాం..!

ఇప్పడికైనా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో 
మినీ అడవులను ఏర్పడు చేద్దాం..!
చెరువులు, కుంటలను పునరుద్ధరణ చేద్దాం..!

నేపాల్ ఘటన మన కళ్ళు తెరువాలి..!
ప్రభుత్వాలు పకృతి పరిరక్షణ కోసం ముందుకు రావాలి..!
===================================
మంజుల పత్తిపాటి 
9347042218
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం .
కామెంట్‌లు