ఎవరివల్ల ఎంత లోతైన
గాయం తగిలిందో
చెబుతావెందుకు?
మంచి కాలం ఎంత మిగిలిందో
చెప్పు...
ఎవ్వరు మనసుకు
ఎంత దగ్గరగా వచ్చారు
ఎందుకు వదిలేసి వెళ్లారో
లెక్కలు దేనికీ?
ఎవ్వరు చివరివరకు నాతో
ఉంటారో చెప్పు!
ఎన్ని మార్పులో ఎన్ని మమతలో
ఎన్ని కలతలో ఎన్ని కన్నీళ్ళో
గుర్తుకు తెస్తావెందుకు?
ఏ ఆనందం తెస్తావో చెప్పు!
ఏ మలుపులు దాటానో
ఏ మజిలీలు చేసానో
ఏ గతుకులు దాటానో
జ్ఞప్తికి తెస్తావెందుకు?
ఏ శిఖరం నాకోసం
ఎదురుచూస్తోందో చెప్పు!
ఏ చీకటికి భయపడ్డానో
ఏ అరుపులకు దడిచానో
ఏ దారి తోచక ఎంత ఏడ్చానో
చూపిస్తావెందుకు?
ఏ తోడు నా వెన్నంటే ఉండి
నడిపిందో చెప్పు!
జీవితమా....
నువ్వు గతం మాత్రమే కాదు
వర్తమానానివి!భవిష్యత్తువి!
కొత్త వెలుగులు కొత్త దారులు
చూపించే కొత్త వేకువవి!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి