సుప్రభాత కవిత : - బృంద


తీరని దాహం వుంది 
నీటిలో గరళం వుంది 
తాగినా... తాగకపోయినా 
మరణం తప్పదు!

నిద్ర పోనీయని 
కలలు కననీయని  
ఇలాటివే ఎన్నో కలతలు 
వేదనలు కన్నీళ్లు 

చేతికి అందని పళ్ళు 
నేటికీ వీడని ముళ్ళు 
వేచిన కలల కళ్ళు 
నడచి అలసిన కాళ్ళు

సహనం నడిపింది 
సాహసం చేయమంది 
సహకారం ఇచ్చింది 
సహగమనం  చేసింది 

ఎన్నో ప్రశ్నలు ఎన్నో అలకలు 
ఎన్నో కినుకలు ఎన్నో రాజీలు 
ఎన్నో అసంతృప్తులు 
ఎన్నో ఆవేశ.. ఆక్రోశాలు

అడగాలని ఉన్నా....
అడగను నిన్ను జీవితమా!
నాకిచ్చిన కొన్ని అదృష్టాలు 
చాలా మందికి ఎండమావులు!

చేతిలో ఉన్నది నా సొంతం 
ఇదే నీవిచ్చిన ప్రసాదం!
నిరసనలు నిందలు లేవు!
వేకువే నువ్విచ్చే వరం!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు