మాయమవుతాను..!!? - డా ప్రతాప్ కౌటిళ్యా.


నేను అజ్ఞాతంలోకి వెళ్ళను మాయమవుతాను. 
మందిలోంచి బంధువుల నుంచి బంధాల్లోంచి 
స్నేహితుల్లోంచీ కుటుంబంలోంచి నేను మాయమవుతాను. 

అమాయకత్వంలో నుంచి సమూహ మాంత్రికత్వంలోంచి నేను మాయమవుతాను. 
కృత్రిమత్వంలోంచి యాంత్రికత్వంలోంచి నేను మాయమవుతాను. 

మోసం వ్యాపారం మాయలోంచి నేను మాయమవుతాను. 
అక్కరకు రానీ చదువుల్లోంచి జాతి నీతి లేని మానవజాతుల్లోంచి నేను మాయమవుతాను. 

మానవత్వం మనిషి తత్వం మనసు లేని మనుషుల్లోంచి నేను మాయమవుతాను. 
కులం మతం దేవుడి రాజ్యంలోంచి నేను మాయమవుతాను.

ఎవరున్నా ఎవరూ లేకున్నా నాయకత్వం 
ఉన్న వారసత్వంలోంచి నేను మాయమవుతా ను.
ఆకలి అన్యాయం పేదరికం వివక్ష 
అసమానత్వంలోంచి నేను మాయమవుతున్న. 

కమ్యూనిజం సోషలిజం ప్రజాస్వామ్యం భయభ్రాంతుల్లోంచి 
బతుకుల్లోంచి నేను మాయమవుతున్నాను. 
బడులు గుడులు మూఢనమ్మకాల మూఢూలోంచి 
నేను మాయమవుతున్నాను. 

సంప్రదాయాలు చాంధస స్వభావాలు సభలు సమావేశాలు 
సంఘాలు బల ప్రదర్శనలోంచి నేను మాయమవుతున్నాను. 
అజ్ఞాతంలోకి వెళ్ళను నేను మాయమవుతున్నాను. 

కామెంట్‌లు