తెనుగు..!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం.!!


పాలపై తేలియాడే మీగడ 
తామరాకుపై నీటి బిందువు
మురళిలో రాలే గాలి 
మేఘం రాల్చే ఆనంద భాష్పాలు -
తెలుగు.

మైదానం ధనం పచ్చదనం 
గడ్డిపరకపై మెరిసే నీటిముత్యం 
కొండల్లో ప్రతిధ్వని ధ్వని 
అంతరంగం తరంగం -తెలుగు..

అమ్మ పాల అమృతం 
స్వచ్ఛమైన పూల పరిమళం 
సెలయేరులో పారే నీరు 
భూగోళమంతా వీచే గాలి -తెలుగు. 

గుండెల్లో పారే ఎర్రని రక్తం 
మల్లె పూల కనిపించి కరిగే మంచు 
స్వేచ్ఛగా ఎగిరి పక్షి రెక్కలు 
వీణ తీగల వాణి -తెలుగు...

పెదాలపై దొర్లే పదాలు 
ఆకుపచ్చ చిలుక పలుకులు 
చిక్కని నీలిరంగు ఆకాశం 
ఎర్రబడ్డ తూర్పు దిక్కు పచ్చబండ పరమర దిక్కు -
మా తెలుగు...
=====================================
తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. 
=====================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు