విజయ శిఖరాలు అధిరోహించాలి- బి.ఉషారాణి-మంచిర్యాల


కలలు కంటే సరిపోతుందా
నిజం చేసుకునేందుకు
చాలా ప్రయత్నం అవసరం కదా

గమ్యం చేరాలనే ఆరాటం తో
నిరంతరం శ్రమ చేస్తూ
అవరోధాలతో పోరాటం చేయాలి.

జీవితం చిన్నదే అయినా
బ్రతుకు మూడు నాళ్లే అయినా
మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి.

ఎత్తుపల్లాలను అధిగమిస్తూ
ఎదురయ్యే సంకటాలను ఎదుర్కొంటూ
గెలుపు కోసం ప్రయాణించాలి.

పట్టుదలతో ముందుకు సాగుతూ
సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ
కలలకు రెక్కలిచ్చి గగనాన్ని తాకాలి.

మనను మనం నిరూపించుకుంటూ
మానవత్వాన్ని నిలుపుకుంటూ
విజయశిఖరాలను అధిరోహించాలి.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super
అజ్ఞాత చెప్పారు…
బాగుంది