:చేదు మిఠాయి!: - పాలగుమ్మి జ్యోతి.


పండుగలే పండుగలు
కావాలి మిఠాయిలు
తీపి కోరే జిహ్వలు 
ఆకాశమంటే ధరలు!!

పెళ్ళిలోన చదివింపులు 
పంచదార బస్తాలు
ఖరీదైన కానుకలు
పంచదార చిలుకలు!!

తీయనైన పంచదార 
తెప్పించెను కంటిధార 
మిఠాయి చూచి మనసార
ఆరగించాలి  కన్నులార !!

తయారీకి ఇథనాల్ ఆయిలు
చెఱకు పంట సరఫరాలు  
పంచదారకు రెక్కలు 
సగటు జీవి జేబుకు చిల్లులు!!
కామెంట్‌లు