ఏముంది … అంతా నార్మలే!: - కొత్త విరిత


 ఈ మధ్య “నార్మల్” అనే మాటకి కూడా ఒక రకమైన అవమాన భావం వచ్చేసింది!రోజంతా ఏదో ఒక సమస్య ఉండాలి.ఎవరితోనో గొడవ ఉండాలి.ఏదో ఒక టెన్షన్ ఉండాలి.లైఫ్‌లో డ్రామా ఉండాలి.అప్పుడే మనం బిజీగా ఉన్నట్టూ, బ్రతుకుతున్నట్టూ అనిపిస్తుంది!
ప్రశాంతంగా ఉన్నావా?
“ఏంటి… ఏదైనా ప్రాబ్లమ్ లేదా?”అంతా సవ్యంగా జరుగుతోందా?
“బోర్‌గా లేదా?”
ఎవరితోనూ గొడవలు లేవా?“అయితే నీ లైఫ్‌లో మసాలా ఏమీ లేదా?”
నిజమే మరి…ఈ రోజుల్లో సమస్యల్ని కూడా స్టేటస్ సింబల్‌లా చూపించాలి!
కష్టాలు లేకపోతే కథ లేదనుకుంటాం.కన్నీళ్లు లేకపోతే ఎమోషన్ లేదనుకుంటాం.గందరగోళం లేకపోతే జీవితం లేదనుకుంటాం.కానీ ఒకసారి ఆలోచించండి…ప్రతి రోజు అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు.ప్రతి రోజు ఏదో ఒక కొత్త ట్విస్ట్ రావాల్సిన అవసరం లేదు.ప్రతి సంబంధంలో గొడవ ఉండాల్సిన అవసరం లేదు.ప్రతి ఉదయం ఒక కొత్త సమస్యతో మొదలవ్వాల్సిన అవసరం లేదు.“అంతా నార్మల్‌గా ఉంది” అనేది బోరింగ్ న్యూస్ కాదు…అది చాలా సందర్భాల్లో గుడ్ న్యూస్!
ఆరోగ్యం బాగుంది.
మనసు ప్రశాంతంగా ఉంది.
ఇంట్లో వాళ్లు క్షేమంగా ఉన్నారు.పని జరుగుతోంది.
అవసరాలు తీరుతున్నాయి.
తిన్నది అరుగుతుంది.
రాత్రి నిద్ర పడుతోంది.
ఇంకేం కావాలి?జీవితం ఎప్పుడూ పండగలా ఉండదు.అలాగే ప్రతిరోజూ విషాద గాథ కూడా కాదు.కొన్ని రోజులు ఏమీ జరగకపోవడమే…చాలా మంచి విషయం.
నార్మల్‌గా ఉండటం అసాధారణం కాదు.అసలు ఈ పరుగుల జీవితంలో నార్మల్‌గా ఉండగలగడమే అసలు అసాధారణం!
కాబట్టి ఎవరైనా “ఏంటి సంగతులు" అని అడిగితే
చిరునవ్వుతో చెప్పండి…
“ఏముంది?
అంతా నార్మలే…
అదే నా అదృష్టం!”
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent write up 👌👌👌
అజ్ఞాత చెప్పారు…
Chala baga chepparu👌🏻👌🏻👌🏻