మెట్రో పోలీస్.. సూపర్ మ్యాన్ తాతయ్య : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-సెయింట్ లూయిస్- అమెరికా.
  

తాతయ్య నువ్వు చిన్నప్పుడు మాకు సూపర్ మ్యాన్ అతీంద్రయ శక్తులు గురించి  ఇండియాలో  ముప్పై ఏళ్ళ క్రిందట చెప్పేవాడివే . నేను అన్న ఎంతో ఆశక్తి గా వినే వాళ్ళం .మన రామాయణ ,భారతాలు తెనాలి రామలింగడు,పంచతంత్ర కథలు ఎంత  బాగుంటాయో ఇవి కూడ అంత శ్రద్ధగా వినేవాళ్ళం 
నిజంగా అలా మనం కూడా చేయగలమా అంటే భడవల్లార ఇది కథ వినండి అని చెప్పేవాడివి అని అమెరికా లో ఉన్న మనుమడు  దగ్గరకు వెళ్ళినపుడు చెప్పాడు 
. 
      మా ఆవిడ మీ తాతయ్య కథలు చెప్పి డెబ్బై ఏళ్ళ జీవితాన్ని గడిపి నాకు అరచేతిలో స్వర్గం చూపించాడని అన్నది. అదికాదే అమ్మమ్మ నిజంగానే సూపర్ మ్యాన్  సృష్టి కర్తలు  జెర్రీ సీగల్, మరియు జోషూస్టర్ 1933 లో సృష్టించారు 
ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఒక కల్పిత సూపర్ హీరో పాత్ర.. అమెరికన్ కామిక్ బుక్స్ ప్రసిద్ధ ప్రచురణ సంస్థ అయిన DC కామిక్స్ ద్వారా ప్రచురించబడినది
ఆరోజుల్లోనే  పిల్లలే కాదు ప్రజలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆదరించబడి  చలన చిత్రంగా రూపొందినబడింది అతీంద్రయ శక్తులు కలిగిన సూపర్ మ్యాన్ గాలిలో ఎగురుతు  గోడలోంచి అవతలి వైపు  లేజర్ కిరణాలతో చూస్తు అత్యధిక శరీర ధారుడ్యం కలిగి అమెరికా లోని కాన్సాస్ రాష్ట్రంలో  రైతు దంపతులు (జోనాథన్, మార్తా కెంట్) అంతరించి పోయే క్రిప్టాన్ అనే గ్రహం నుంచి వచ్చిన కాల్ ఎల్ గ్రహాంతర్యామికి  'క్లార్క్ కెంట్ 'అని పేరుపెట్టి పెద్ద చేస్తారు అతనిలో ఉన్న అతీంద్రియ శక్తి వల్ల సూపర్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందాడు  అమెరికా లోని మెట్రో పోలీస్ భూమి పై స్పస్థలం  రేపు తాతయ్య అమ్మమ్మ మిమ్మల్ని తీసుకు వెళుతున్నా అని తీసుకు వెళ్ళి ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర మీరు నించో0డి అని సూపర్ మ్యాన్ ఫోటో తీసి భలే ఉన్నారు అని అంటే మరి తాతయ్య మజాకావా అని నన్ను సూపర్ మ్యాన్ చేసావురా  మాధవా అంటే 
వెంటనే ఏభై ఏళ్ళయి కాపురం చేసిన నా ధర్మపత్ని మనుమడితో నలభై ఏళ్ళ క్రితం 'సూపర్ మ్యాన్' సినిమాలో   నటించిన నట సార్వభౌమ ఎన్. టి. రామారావు లా ఉన్నారు అని  అంటే గర్వంగా మీసాలు మెలివేసాను..!
................................
కామెంట్‌లు