టైం ఆగిపోతే…: -— మంజుల పత్తిపాటి


టైం ఆగిపోతే…
ప్రకృతి  మౌనమైపోతే…
పరుగులు తీసే ఈ లోకం
ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుంటుందా..?

నిన్నటి జ్ఞాపకాలు
నేటి గడప దాటి వస్తాయా
చేతుల నుంచి జారిపోతున్న ప్రాణం 
మళ్లీ ఊపిరి పీల్చుకుంటుందా..?


డబ్బు కోసం పరుగెత్తిన మనిషి
అదే డబ్బుతో టైముని కొనగలడా..?

ధన దాహంతో పచ్చదనాన్ని నాశనం చేసి
కాంక్రీటు అడవుల్లో బహుళ అంతస్తుల భవనాల్లో 
నివసిస్తున్న బడా బాబులు…
అదే డబ్బుతో టైముని కొనగలడా..?

కానీ ఆ రోజు ఎప్పడికి రాకుండా చూడాల్సిన 
బాధ్యత మన అందరిపై ఉన్నది..!

ఓ మనిషి
నిజంగానే టైం ఆగిపోతే…
నీవు సంపాదించుకున్న సొమ్ము గంగపాలు అవుతుంది..!

కనుక
సంపాదించుకున్న సొమ్ములో 
కొంత పకృతి కోసం ఖర్చు పెట్టు..!
ప్రకృతిని కాపాడు…మనిషితనాన్ని నిలబెట్టు..!
=====================================
 మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.
కామెంట్‌లు