మద్దుల పాపా : - వరలక్ష్మి యనమండ్ర


సుద్దులు చెబుతా వినవమ్మా
హద్దులు మరచీ అడద్దమ్మా
దెబ్బలు తగులును జాగ్రత్తమ్మా
సుద్దులు చెబుతా వినవమ్మా 

పెద్దల మాటను వినవమ్మా 
బుద్ధిగ ఉంటే మేలమ్మా 
మొద్దు నిద్దుర వలదమ్మా 
వేకువ పొద్దున లేవాలమ్మా

ముద్దుల బాలుడు ఉన్నాడు 
సద్దు చేయకనే వెళ్తాడు 
వెన్న ముద్దలను  తింటాడు
రక్కసులకు బుద్ధి చెప్పాడు
ముద్దులపాపా అతడెవరమ్మా

ఎద్దు ఎక్కిన దేవుడెవరమ్మా 
ఇద్దరు సతులకు పతి ఎవరమ్మా
మద్దెల మోతకు నాట్యం చేయును
ముద్దుల పాపా  చెప్పాలమ్మా

కామెంట్‌లు