హైదరాబాద్ లో గద్వాల సోమన్న పుస్తకావిష్కరణలు


 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 108.చిరుగాలి మరియు 109.కాలి అందియలు పుస్తకావుస్కరణలు శారదా లైవ్ స్టూడియో హిమాయత్ నగర్,హైదరాబాద్ లో  ఘనంగా జరిగాయి. వాల్మీకి సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాదా సాహెబ్ ఫాల్కే  అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరావు,పద్మభూషణ్, కళాప్రపూర్ణ శ్రీ గుఱ్ఱం జాషువా గారల జయంతులు మరియు గానగంధర్వుడు, పద్మ విభూషణ్ శ్రీ బాలు సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్మృతి నీరాజనం కార్యక్రమంలో డా. ఓలేటి పార్వతీశం, డా.యం. కె. రాము,డా. వి. డి. రాజగోపాల్ మరియు కళాపోషకులు, విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ ఏ. ఎల్. కృష్ణా రెడ్డి గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం బాలగేయ బ్రహ్మ సోమన్నను వారి విశేష కృషికి సత్కరించారు.కార్యక్రమంలో కవులు, కళాకారులు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.తోటి ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు సోమన్నను అభినందించారు.
కామెంట్‌లు