అమెరికా లో పవిత్రమైన శ్రావణమాస కావడి : -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)- సెయింట్ లూయిస్ - అమెరికా

 

  సంపత్కారుడు శివుడు. అతి పవిత్రమైన శ్రావణ మాసంలో  ఉత్తరాది ప్రజలు శివభక్తులు 'కన్వర్ యాత్ర'  దీనినే ' కావడి యాత్ర' అని కూడా అంటారు   మా అమ్మాయి అమెరికా సెయింట్ లూయిస్ లో     మొన్న నేను వెళ్ళినపుడు అక్కడ  ఉన్న రంజిత్ పటేల్ శివుని అభిషేకం  కావడి తో మొన్న మేం కాశీ నుంచి తెచ్చిన గంగా జలంతో  దుర్గమ్మ దేవాలయంలో చేస్తున్నాము తప్పక మీ వంటి పెద్దలు  పాల్గొనాలి అంటే  డెబ్బది సంవత్సరాలు దాటిన వయస్సులో నేను తప్పక పాల్గొంటాను అంటే మా అల్లుడు తప్పక తీసుకెళతానంటే వెళ్ళాను .  సాధారణంగా శ్రావణ మాస ఏకాదశి లేదా మాస శివరాత్రి నాడు అభ్యంగన స్నానంచేసి కాల మాన పరిస్థితులకు అనుగుణంగా వెదురు బొంగుల చివరన పూలమాలలతో అలంకరణ చేసి  ఇరువైపులా కుండలకు బదులుగా చిన్న ఇత్తడి బిందెలు కట్టి అందు నీటిలో  కాశీ హరిద్వార్ నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలం వేసి మొదట రక్ష కట్టుకు అశ్వర్ధ వృక్షం (రావి చెట్టు) చుట్టు  
 
"మూలతో బ్రహ్మ రూపాయ 
మధ్యతో విష్ణు రూపిణీ 
ఆగ్రతో శివ రూపాయ 
వృక్ష రాజాయతే నమః"
అని ముమ్మారు ప్రదక్షిణ చేసి 
హర హర మహాదేవ అంటు భుజాన కావడి పెట్టుకు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి 
తదనంతరం విఘ్నేశ్వర పూజ చేసిన తరువాత 
కావడితో శివభక్తులు తెచ్చిన గంగా జలం కలిపిన నీటితో రుద్రసూక్త పఠనం నమక, చమక సహితంగా చేసి
శివమంత్రం
"నమః శంభవేచ మయోభవేచ
నమః శంకరాయచ మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ* అని చెబుతు  
లింగాష్టక  బిల్వాష్టక లతో పూజించి 
ధూప దీప నైవేద్యాలను సమర్పించి కోరిన కోర్కెలు తీర్చే సంపత్కారుడు పరమశివుడిని అర్చించి ఏ దేశమైన మన సంస్కృతి సంప్రదాయాలు పాటించడం చాలా సంతోషం కలిగించింది.!
 లోకా:  సమస్తా: సుఖినోభవంతు !!
..........................

కామెంట్‌లు