ఉత్తమ ఎంఈఓ ప్రవీణ్ కు అభినందన సత్కారం


 ఇటీవల జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ జిల్లా వేదికపై, ప్రముఖులచే ఉత్తమ మండల విద్యాశాఖాధికారిగా పురస్కారం స్వీకరించిన రాజాం ఎంఈఓ పి.ప్రవీణ్ కుమార్ ను అభినందిస్తూ, స్థానిక మండల వనరుల కేంద్రం ఆవరణలో ఘనసన్మానం జరిగింది. పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు ఎంఈఓ ప్రవీణ్ సేవలను కొనియాడారు. పాఠశాలల్లో విద్యా శాఖ పథకాలను సక్రమంగా అమలు పర్చేలా, విద్యార్థుల్లో చదువుల స్థాయిని మెరుగుపర్చేలా ప్రవీణ్ కుమార్ కృషి మిక్కిలి ప్రశంసనీయమైనదని అన్నారు. జిల్లా ఉత్తమ ఎంఈఓ పురస్కారంతో సత్కారం పొందుట మనందరికీ ఎంతో గర్వకారణమని తిరుమలరావు అన్నారు. ఈ సందర్భంగా కుదమ తిరుమలరావు, 
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి డోల వాసుదేవరావు,  
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు మారెళ్ళ కృష్ణమూర్తి, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు కరణం బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎస్.కొండలరావు, రాష్ట్ర నాయకులు ఎస్.పైడిరాజు, సంక్రాంతి రామకృష్ణ తదితరులు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ ను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు