పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు బాలబంధువు పురస్కారం పొందారు. శ్రీ హంసవాహిని సాహిత్య కళా పీఠం వాట్సాప్ వేదికగా నిర్వహించిన బాలగేయాల పోటీల్లో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఈ గౌరవం లభించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, భైంసా కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న తిరుమలరావు బాలల హక్కులు బాలల బాధ్యతలు సాహస బాలల నేపథ్యాలను తన బాలగేయాలలో రచించిరి. ఉగ్రవాదులను మాటల్లో ముంచుతూ ఆర్మీ జవాన్లకు సమాచారాలిచ్చిన బాలల తెగువ, రైలు దుర్ఘటనలందు చెరువులందు అగ్నినందు చిక్కుకున్న వారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి, శక్తిదీరా బయటకు తీసి కాపాడిన చిన్నారుల మానవత వంటి సంఘటనలను తిరుమలరావు ఉదహరిస్తూ తన కవిత్వాన చాటిచెప్పారు. తొలి ప్రపంచ యుద్ధానంతరం, నానాజాతి సమితి సూచన ప్రాయం, వందేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన బాలల హక్కులను తన గేయాలలో తిరుమలరావు గుర్తుచేస్తూ బాలల పరిరక్షణకు పెద్దలంతా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. తిరుమలరావు ప్రతిభను ప్రశంసిస్తూ శ్రీ హంసవాహిని సాహిత్య కళాపీఠం జాతీయ అధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావ్ పాటిల్, అధ్యక్షులు జాగిరి యాదగిరి, పర్యవేక్షకులు పి.బి.ఎల్.కె. ప్రసాద్ లు బాలబంధువు పురస్కారానికి ఎంపిక చేసి, పురస్కార ప్రశంసాపత్రం బహూకరించారు. తిరుమలరావుకు హంసవాహిని వంటి గొప్ప సంస్థ నుంచి బాలబంధువు పురస్కారం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
తిరుమలరావుకు బాలబంధువు పురస్కారం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి