ఆచార్యదేవోభవ: - బి.ఉషారాణి-Govt టీచర్-మంచిర్యాల


అజ్ఞాన తిమిరాన్ని తొలగించి
మదిలో జ్ఞాన జ్యోతిని వెలిగించి
సన్మార్గంలో నడిపే చేయూత గురువు

చేత సుద్ద పట్టించి అక్షరాలు దిద్దిస్తూ
బెత్తం పట్టి క్రమశిక్షణ అలవరుస్తూ
మంచి నడవడికను నేర్పేది గురువు

తప్పులు చేస్తే సరిదిద్దుతూ
గొప్పగా చేస్తే ప్రోత్సహిస్తూ
విజయం వైపు నడిపించేది గురువు

పుస్తకాలలోని పాఠాలతో పాటు
జీవిత సత్యాలను కూడా నేర్పించి
విలువలను మనసులో పాదుకొల్పేది గురువు

విజ్ఞానాన్ని పెంపొందిస్తూ
వినయాన్ని అలవరుస్తూ
వివేకాన్ని పెంచేది గురువు

కృషిచేస్తే సాధించలేనిది లేదంటూ
కష్టపడితే కలలు నిజమవుతాయంటూ
నిత్యం వెన్నుతట్టేది గురువు

ఓటమికి వెరవక ముందుకు సాగాలని
పడిపోయినా లేచి నిలబడాలనే
పట్టుదలను పెంచేది గురువు

తల్లిదండ్రుల తర్వాత దైవంగా నిలిచి
జీవితానికి దిశానిర్దేశం చేసేది గురువే
అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్య దేవోభవ అన్నారు మన పెద్దలు
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super
అజ్ఞాత చెప్పారు…
👌👌👌