దేనికోసం..!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.


అడవులు దాటాను 
పర్వతాలు దాటాను 
ఎడారులు దాటాను 
సముద్రాలు దాటాను 

నిశ్శబ్దంగా 
ఆరు దశాబ్దాలు దాటాను 
దేనికోసం...!?

అరిచాను 
విరిగాను 
పగిలాను 
మళ్లీ అతుక్కున్నాను.!!

నిప్పుల్లో కాలాను 
నీరులా ఆవిరయ్యాను 
మండుటెండల్లా మండాను 
కాలంలా
మౌనంగా నడిచాను....!!

గుండె ఊపిరి ఆగిపోయింది 
గాలిలా మారాను. 
మాట చూపు పడిపోయింది 
కాంతిలా మారాను. 

అడవులు దాటాను 
పర్వతాలు దాటాను 
ఎడారులు దాటాను 
సముద్రాలు దాటాను 
నిశ్శబ్దంగా 
ఆరు దశాబ్దాలు దాటాను 

దేనికోసం..!?

నా ముందు ఆశ ఉంది 
చావు ఉంది.!!?
==================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు