రాజు గారి రెండో భార్య!: - కొత్త విరిత
 

నీకు ఒక రాజకీయ నాయకుడు ఇష్టం లేదు అంటే,ఇంకొక నాయకుడు ఇష్టం అనే అర్థం కదా!
నీకు వాడు నచ్చలేదు అంటే,ఇంకొకడు నచ్చాడనే కదా!నీకు ఈ పని చేయాలనిపించడం లేదు అంటే,వేరే పని చేయాలనిపిస్తోందనే కదా!
మనిషి “వద్దు” అన్న ప్రతిసారీ… దాని వెనకాల ఇంకో “కావాలి” దాక్కునే ఉంటుంది.
చాయ్ వద్దంటే కాఫీ కావాలి…
కాఫీ వద్దంటే చల్లని పానీయం కావాలి!
ఒక ఉద్యోగం నచ్చలేదంటే… ఇంకో ఉద్యోగమే కలల ఉద్యోగమని ఊహించేస్తాం.
ఒక మనిషితో మాట్లాడటం ఇష్టం లేదంటే… ఇంకొకరితో గంటలకొద్దీ మాట్లాడతారని అనుకుంటాం.
“నాకు రాజకీయాలు నచ్చవు” అన్నా… వెంటనే “అయితే ఎవరి వైపు?” అని అడిగే సమాజం మనది.
ఎవరినైనా విమర్శిస్తే… “మరి నువ్వు ఎవరిని సమర్థిస్తున్నావు?” అనేది వెంటనే వచ్చే ప్రశ్న!
నచ్చనిదాన్ని తిరస్కరించడానికి… ఇంకొక నచ్చినదాన్ని చూపించాల్సిందే అన్నట్టు ఉంటుంది.
“నాకు అది వద్దు” అన్నా కూడా…
 “మరి ఏది కావాలి?” అని వెంటపడతాం.
అసలు నచ్చకపోవడం కూడా ఒక అభిప్రాయమే అని ఒప్పుకోవడానికి మాత్రం మన అహంకారం ఒప్పుకోదు.
ఇక రాజు గారికి రెండో భార్య చాలా ఇష్టం అంట!
అంటే మొదటి భార్య అంతగా ఇష్టం లేదని అర్థం చేసుకోవడం మన జన్మహక్కే కదా!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good Narration
అజ్ఞాత చెప్పారు…
Good