రాజులు రాజ్యాలు… ప్రజలు ప్రభుత్వాలు… మారినా, నిధుల దాపరికం మాత్రం మారలేదు!
ఒకప్పుడు రాజులు తమ నిధులను గుప్తంగా దాచేవారు,ప్రజలు కూడా తమ డబ్బును జాగ్రత్తగా దాచుకునేవారు.ఆ రోజుల్లో “గుప్త నిధి ఎక్కడుంది?” అన్నది పెద్ద ప్రశ్న.
ఎక్కడుందో తెలిసినవాడికి,దాన్ని ఎలా చేరాలో ఒక రహస్య ప్లాన్ కూడా పక్కాగా ఉండేది!కాలం మారింది… నిధులు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి వచ్చింది!
కానీ ఇప్పుడు “గుప్తా రోగాలు” మాత్రం పుష్కలంగా ఉన్నాయి!
వాటిని ఎక్కడ దాచామో కాదు… అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదు!ఇక వాటిని ఎలా తగ్గించాలో ప్లాన్ ఉందా అంటే… అదో పెద్ద గుప్త రహస్యం!రోగం ఏంటో కనుక్కోవడానికి ముందే గూగుల్‌లో పది వ్యాధులు చదివేస్తాం!చివరికి డాక్టర్ చెప్పినప్పుడు… “ఓహో… ఇలాంటి రోగం కూడా ఉందా?” అని ఆశ్చర్యపోవడం మామూలైపోయింది!
ఒకప్పుడు గుప్త నిధుల కోసం సంకేతాలు, రహస్య మార్గాలు వెతికేవాళ్లం.
ఇప్పుడు గుప్త రోగాల కోసం టెస్టులు, స్కాన్లు, రిపోర్టులు వెతుకుతున్నాం!
అప్పుడు నిధి దొరికితే ఆనందం… ఇప్పుడు రోగం దొరకకపోతే ఆనందం!
ఇదే మనిషి సాధించిన అద్భుతమైన పురోగతి అనుకోవాలేమో!
గుప్త నిధుల నుంచి గుప్త రోగాల దాకా… మనిషి పురోగతి నిజంగానే గుప్తమే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి