హాపీ బర్త్ డే : - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
కనులు తెరిచిన తొలి కేక గొంతు ఐదేళ్లు గువ్వ పాట ఆరేళ్ల వాకిట నవ్వే చుక్కల ముగ్గు పిలుపు ఆటపాటల విరిసిన ఆనందగీతం అమేయ రెక్కలు సవరించిన విపంచి సంతోషం ఆకాశమంత చదువు సాగు తొవ్వ అక్షర ఆభరణాల నవ్వు చిందే పూల వాసనల అందం చిన్ని అమేయ ఆలపించే స్వచ్ఛ మధుర నదీగీతం హాపీ బర్త్ డే టు యూ అమేయ
• T. VEDANTA SURY