1.
తడిస్తే కూచిపూడి జల యంత్రం వెల్లువైతే తకధిమి తాళం
సుఖదుఃఖాల మట్టే నీరూ కన్నీరు ఊపిరి
2.
చిటపట చినుకులు రాలే
చుక్కల తడితడి టపటప మౌనభూమి
రెక్కల చప్పుడు మెరిసే భూరుహం
3.
నింగినేలే మనసు దిగింది
నేలకు మనిషితో కలిసి కిందకు
ఆశ్చర్యం అద్భుతం తడిసిన పాయ పాదాల కింద
4.
మట్టిని చదివే వేళ్ళలో
వేళ్ళూ ఊడలు చనుబాల దీపాలు
సృజన,సంరక్షణ చెమ్మ క్యాన్వాస్ మీటే అమ్మ వాన
5.
కండరాలు సకిలం ముకులం ఆట
జారిన తీగలపై జలవిద్యుత్ వాహ్యాళి
చిత్రంగా తడిపొడి వాసన తోపుడు బండి
6.
పిడికిలి తెరిచింది నల్లమబ్బు
చాప చుట్టేసింది మండుటెండ
తలదాల్చింది ప్రకృతి మనసు రాలి తడిసే కొమ్మకు
7.
గలగల గోదావరి వొంపుసొంపుల నురుగు
పోటెత్తిన ఆగమాగం దారులు
వికాస జలఖడ్గం మునిగే విధ్వంస వాన
8.
మబ్బుల ఆకాశం పొద్దంతా
తడిగాలి ఊగే చలిమంచు జవరాలు
గట్లు తప్పిన ప్రవాహ జ్వాల వరదల వాన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి