రేపు నంద్యాలలో జాతీయ స్థాయి బాలోత్సవము జాతీయ కవి సమ్మేళనం: - జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి

 ఉషోదయ ఫౌండేషన్ తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యములో నవంబర్ 9 తేదీ ఆదివారం  శ్రీశైలహైస్కూల్ సాయిబాబ నగర్ నంద్యాలలో జాతీయ కవి సమ్మేళనము నిర్వహించబడును. డా. యు .వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో పసిడి నవ్వులు వెలుగు దివ్వెలు అనే అంశములో కవి సమ్మేళనం నిర్వహణ జరుగును. ముందస్తు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలతో నృత్య ప్రదర్శనలు కన్నులు విందుగా ప్రదర్శన జరుగును.కార్యక్రమంలో పాల్గొన్న కవులు కళాకారులను జానపద సేవా మంజరి మరియు బాల చైతన్య సేవా పురస్కారంతో సత్కారం చేయబడునని  డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు తెలియజేశారు కార్యక్రమంను డా.తుపాకుల మరియదాస్ మరియు నీలకoఠమాచారి నంద్యాల కమిటీ సభ్యులు సమన్యయం చేయడము జరుగును.డా. గెలివి సహదేవుడు  ప్రముఖులు పాల్గొననున్నారు.
కామెంట్‌లు
Balu Kayyuru చెప్పారు…
Good job keep it up