చిత్రమైనది నీ రూపం:- దోసపాటి వేంకట రామచంద్ర రావు - విజయనగరం

సాహితీ కెరటాలు 

==============

బాపుబొమ్మవు నీవు

వపా చిత్రనీవీవు

 కృష్ణశాస్త్రి కవితలు

 జంధ్యాల కరుణశ్రీవి

 కందుకూరి కావ్యానివి

 గురజాడ అడుగుజాడవు

 గిడుగు వారి పిడుగువు

ఎన్ని చిత్రాతిరూపాలమ్మ నీవి

ముళ్ళపూడి పెసునాంబవి

భానుమతి అత్తగారి

మునిమాణిక్యం వారి కాంతానివి

ఎందరెందరో నిన్ను పొగిడారు

ఇంకెందరో నిన్ను తెగిడారు

వాణి నావాణి అన్నారొకరు

వీణాపాణి వన్నారింకొకరు

ఎవరేమన్నా తెలుగుతల్లివి నీవు

తరతరాలకు వెలుగొందుతావు

తెలుగు తల్లికి వందనం వందనం.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
మాధుర్యం గుండె నిండుగా
మదినే మెదిలే గుణం పండగా
భావం,రూపం మరేదీ కాదు భేదం
భాషా భూషామతల్లి సుమగంధం
బహు మేధా వరేణ్య సంకల్పబంధం
తెలుగు వెలుగుకళా సౌందర్యం
అభినందనలు