విద్యార్థులకు బహుమతులు
 ఆదర్శ అధ్యాపకురాలు నాగకల్యాణి భీమవరంలో డి.ఎన్.ఆర్.కళాశాలలో ఎం.ఏ.చదివారు.2002_2003నుంచి కూకట్ పల్లి కె.పి.హెచ్.బి.కాలనీలోని ప్రతిభావిద్యానికేతన్ హైస్కూల్లోతెలుగుఅధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.6_10వతరగతులకు తెలుగుబోధిస్తూ సాధనాసాహితీ స్రవంతి సంస్థ నిర్వహించే పోటీల్లో పిల్లల కి శిక్షణ ఇస్తూబహుమతులపంట పండిస్తున్నారు.ఆసంస్థ రజతోత్సవసందర్భంగా నిర్వహించిన పద్యాలపోటీల్లో ప్రథమ,ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులందుకున్నారు విద్యార్థులు.ఆవివరాలు
 6_7 తరగతులకు కరుణశ్రీ గారి*తెలుగుబాలశతకం*
8_9క్లాసులకి నండూరికృష్ణమాచార్యులవారి*నడిచేపద్యంనండూరి* లో పోటీలు జరిగాయి.
పి.రిత్విక్ 6వక్లాస్  3000రూపాయలు (రెండో బహుమతి)
జి.యోగసిద్ధేశ్వర్ (7వక్లాస్)రు5000 (ప్రథమ)
కె.వి.వి.ఎస్.పి.ప్రత్యూష (8వక్లాస్)రు 3000 (ద్వితీయ)
సి.హెచ్.ప్రణీత  (8వక్లాస్)
రు 2000 (మూడవబహుమతి)
ఎన్.శరణ్య (8వక్లాస్)
రు1000  ప్రోత్సాహక బహుమతి
ఐ.కామేశ్వరి 9 వక్లాస్
రు 5000(ప్రథమ)
సురవరం ప్రతాపరెడ్డి తెలుగుయూనివర్శిటీలో వీరికి డా.కె.వి.రమణాచారిగారు(ఐ.ఎ.ఎస్.) సుద్దాల అశోక్ తేజగారు  బహుమతుల ప్రదానం చేశారు🌷

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
శుభాకాంక్షలు 💐
శుభాభినందనలు 🙏💐
HARISH KRISHNA చెప్పారు…
శుభాకాంక్షలు -💐
మీరు తెలుగుల వెలుగు.
మీవల్ల తెలుగుకున్న తెగులు తొలగు.
మీ తెలుగు బాష సంస్కరణ
తెలుగు జాతి ఆణిముత్యాల ఆవిష్కరణ

సబా సమ్మోహనం
సదా ముదావహం 💐🙏