అంధత్వం ఏదీ చూపించకపోయినా
బంధుత్వం వక్రీకరించినా
అందరూ అంధురాలని ఆటపట్టించినా
అవయవ లోపం అన్యాయం కాదని
లోపం శాపం, పాపం కాదని
ఆగ్రహం లేకుండా మనో నిగ్రహ నేత్రంతో
, తాన్యా తాననుకున్న న్యాయ శాస్త్రాన్ని
బ్రెయిలీలో డైలీగా చదివి న్యాయవ్యవస్థ
ఉద్యోగ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి
దివ్యంగా తొలి న్యాయమూర్తిగా నియమితులైన
దివ్యాంగురాలు. "హ్యాట్సాఫ్ టూ తాన్యా నాథన్"
తిమిరంపై విజయం : - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ) సారవకోట
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి