విషాన్నీ పరిమళంగా మార్చి పరిమళాన్ని విషయంగా ఉపయోగించి
మకరందం తాగి తేనెగా మార్చేది మగువ ఒక్కతే.
శరీరం గాయం కాని గాలిలా విరిగిపోని నీరులా ఎదలు
ఉప్పొంగి
వాగు వంపు చంద్రవంక పై వాలిపోయింది ఆమె.
మెత్తని మల్లెల మత్తులో అల్లుకున్న తీగలు పగలు రాత్రి మేల్కొన్నట్లు
ముత్యాల నవ్వుల్లో తెల్లగా పూస్తున్నవీ
గంధం పూసిన గదువ సరిచేసిన స్వరం ఒక్కటై ముచ్చట్లు ఆడుతుంటే
గుండెకాయ చడీ చప్పుడు లేకుండా కొట్టుకుంటుంది.
ఊపిరి బిగబట్టిన తొలిప్రేమ తీసుకోవడం తప్ప ఇవ్వడంలేని శ్వాసగా చలామణి అవుతుంది.
అదిరిపడ్డ కొంటె చూపు నిద్ర లేకుండా నిరంతరం తలుపులు తెరిచే ఉంటుంది.
ఆరబోసిన వెన్నెల్లో కన్నెపిల్లలు కలువల్ల విచ్చుకుని స్వప్నాల్లో తేలుతున్నవి.
ఎగిరే పక్షుల్లా సందెపొద్దుల్లో ఎదురుచూస్తున్న మగువల వలపుల తలపులు మెల్లిమెల్లిగా మూసుకుంటున్నాయి.
అమృతం తాగిన ఆడతనం పొగడ పూల పరిమళంతో దేవుని సన్నిధి చేరింది.
నల్లని కురుల్లా ఉరుములు మెరుపుల మధ్య ఇంద్రధనస్సు ఒకటి మెరిసీ కనిపించకుండా కరిగిపోయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి