ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాల విద్యార్థిని ఎం. శ్రీలక్ష్మీ ప్రసన్న ప్రతిష్ఠాత్మక యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్లో చోటు సంపాదించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచిందని
పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపుడి వీరేంద్ర చౌదరిగారు ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ స్వర మధురిమ కల్చరల్స్, ఖమ్మం ఆధ్వర్యంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన "క్లాసికల్ నైట్ ఇన్ మన ఖమ్మం" కార్యక్రమంలో 125 మంది భరతనాట్యం, కూచిపూడి నర్తకులు 30 నిమిషాల పాటు నిరవధికంగా నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు ప్రయత్నంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల విద్యార్థిని ఎం. శ్రీలక్ష్మీ ప్రసన్న అద్భుత ప్రతిభ కనబరిచి విజయవంతంగా పాల్గొనడంతో యూనివర్సల్ బుక్ ఆఫ్ గోల్డెన్ రికార్డ్స్ నుండి అధికారిక ప్రశంసాపత్రాన్ని అందుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు .ఈ సందర్భంగా పాఠశాల సిఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ,వైస్ ప్రిన్సిపల్స్ స్వప్న ,ముస్తఫా , క్యాంపస్ ఇంచార్జ్ విక్టర్ చార్లెస్, ట్రాన్స్పోర్ట్ ఇంచార్జ్ సందీప్ ఉపాధ్యాయినీ- ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ-విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి