వీళ్ల దగ్గర స్క్రిప్ట్ ఉండదు, కెమెరా ఉండదు,పని ఉండదు. కానీ “యాక్షన్… కట్!” చెప్పడంలో మాత్రం వీళ్లను మించినవాళ్లు ఉండరు.పని చేయడం చేతకాదు… కానీ పని ఎలా చేయాలో చెప్పడంలో మాత్రం వీళ్లకు పీహెచ్‌డీ
ఉంటుంది.“ఇలా చేయాలి… అలా చేయకూడదు” అంటూ ఉచిత సలహాల ఇస్తుంటారు.ఇంట్లోనూ, బయటా ఇలాంటి డైరెక్టర్లు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు.వాళ్ల చేతికి పని ఇస్తే "కారణాలు" వస్తాయి… ఇంకొకరి చేతిలో పని ఉంటే "సూచనలు" వస్తాయి.పని చేసే మనిషి చెమటోడుస్తుంటే, వీళ్లు పక్కన నిలబడి "ఉషో... ఇది కూడా రాదా" అన్నట్లు చూస్తారు.చేసేవాడికి సమస్యలు కనిపిస్తాయి… చేయనివాడికి మాత్రం తప్పులు మాత్రమే కనిపిస్తాయి.పని సక్సెస్ అయితే“నేను ముందే చెప్పాను కదా!” అంటూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటారు.
ఫెయిల్ అయితే “నేను అలా చేయొద్దని ముందే చెప్పాను!” అంటూ బాధ్యతను బయటకు పంపిస్తారు.అంటే… విజయం వస్తే వీళ్ల డైరెక్షన్… వైఫల్యం వస్తే నీ డెసిషన్!
చేసే "పని" అనే సినిమా హిట్టా… ఫట్టా… వీళ్లకు అసలు సంబంధమే లేదు.ఎందుకంటే రెండు పరిస్థితులకీ డైలాగ్ ముందే సిద్ధంగా ఉంటుంది.హిట్టయితే “నా ప్లాన్.” ఫట్టయితే “వాళ్లు నా మాట వినలేదు.”పని చేయకుండా ప్రభావం చూపించడం ప్రపంచంలోనే చవకైన మేనేజ్‌మెంట్ టెక్నిక్.సలహా ఇవ్వడం సులువు… కానీ ఆ సలహా ఫలితానికి బాధ్యత వహించడం మాత్రం అసలైన కష్టం.అందుకే కొందరు జీవితాంతం డైరెక్టర్లుగానే ఉంటారు తమ జీవితానికి మాత్రం యాక్షన్ చచ్చినా చెప్పరు.
"మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి డైరెక్టర్లు ఉండే ఉంటారు కదా!"

Super writeup 👌👌👌
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి