తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి,
ర్యాంక్ లు అంటూ వెంటబడి వేధించి
మార్కుల వేటలో వారిని విడిచి
అందమైన బాల్యాన్ని అనుభవించకుండా
మన పెద్దరికం వారిని ఇబ్బందిపెడుతోందా
ప్రకృతిలో గడిపేందుకు అవకాశం లేదు
జంతువులు, పక్షులతో చెలిమి చేసేందుకు
ఆరుబయట ఆటలు ఆడేందుకు కూడా
మననుంచి వారికి అనుమతి లేదు
వారి చదువుకు మనమే దిశా నిర్దేశం చేస్తూ
ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో కమ్మంటూ
వారి అభిరుచిని, ఆసక్తిని ప్రోత్సహించక
వారి మనసును గాయపరుస్తున్నామా
చదువు పరుగు పందెంలో వెనుకబడితే
జీవితంలో అన్నీ కోల్పోయినట్టేననే
భావన వారి హృదయాలలో కలిగించి
ఆత్మహత్యలకు కూడా పాల్పడే వైపుగా
వారి మనసులలో ఆందోళన కలిగిస్తున్నామా
పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచిద్దామా
పిల్లల ఊహలకు రెక్కలొచ్చేలా స్వేచ్ఛనిచ్చి
మన చిన్నారులకు ఒత్తిడి లేని
మధురమైన బాల్యాన్ని అందిద్దామా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి